పర్సనల్ రీజన్.. వైదొలగిన పీవీ సింధు

by Shiva |
పర్సనల్ రీజన్.. వైదొలగిన పీవీ సింధు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ (Shuttler) పీవీ సింధు ఈ ఏడాది జరగాల్సిన థామస్ అండ్ ఉబెర్ కప్ (Thomas and Uber Cup) నుంచి వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నట్లు ప్రకటించింది. సింధు తండ్రి పీవీ రమణ ఏఎన్ఐ (ANI)తో మాట్లాడుతూ.. ‘సింధు ఈ ఏడాది థామస్ అండ్ ఉబెర్ కప్‌లో పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 11 వరు డెన్మార్క్‌లో థామస్ అండ్ ఉబెర్ కప్ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో చాలా కాలంగా ఇంటికే పరిమితమైన సింధు.. ఈ టోర్నీ ద్వారా తిరిగి కోర్టులోకి అడుగుపెడుతుందని అందరూ భావించారు.

ఒలింపిక్స్‌ (Olympics)కు సిద్దమవుతున్న ఎనిమిది మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల (Badminton players)లో సింధు ఒకరు. కానీ అనూహ్యంగా కీలకమైన టోర్నీకి దూరమవుతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సింధు.. ఆ సంస్థ ఇన్‌స్టాగ్రమ్ (Instagram) స్టోరీలో తన తండ్రి గురించి చెప్పుకొచ్చింది. ‘బ్యాడ్మింటన్‌ను కెరీగా ఎంచుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నాన్న నన్ను కాదని అనలేదు. నాకు ఆయన స్ఫూర్తి. కాగా, తాను డాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు అనుకున్నాను. ఇప్పుడు బ్యాడ్మింటనే బాగుంది’ అని ఆ స్టోరీలో చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed