తగ్గిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

by Harish |
తగ్గిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి నెలలో ప్యాసింజర్ వాహనాల(పీవీ) రిటైల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 28.39 శాతం వృద్ధితో 2,79,745 యూనిట్లకు చేరుకున్నాయని ఆటోమోబైల్ డీలర్స్ బాడీ ఎఫ్ఏడీఏ గురువారం తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో అమ్మకాలు దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం మార్చిలో 2,17,879 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశంలోని 1,277 ఆర్టీవో కార్యాలయాల నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ డేటాను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ) వెల్లడించింది.

దీని ప్రకారం.. గత నెలలో టూ-వీలర్ వాహనాల అమ్మకాలు 35.26 శాతం క్షీణించి 11,95,445 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో 18,46,613 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్ వాహనాల అమ్మకాలు సైతం 42.2 శాతం క్షీణించి 67,372 యూనిట్లు నమోదయ్యాయి. అలాగే, త్రీ-వీలర్ వాహన అమ్మకాలు 50.72 శాతం క్షీణించి 38,034 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, వ్యవసాయ రంగం సానుకూలంగా ఉండటంతో ట్రాక్టర్ అమ్మకాలు మార్చిలో 29.21 శాతం పెరిగి 69,082 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

వార్షిక ప్రాతిపదికన మొత్తం రిజిస్ట్రేషన్లు 28.64 శాతం తగ్గి 23,11,687 యూనిట్లకు చేరుకున్నాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేష్ గులాటి చెప్పారు. ‘ఇటీవల విడుదలైన ప్యూ పరిశోధనా సంస్థ వివరాల ప్రకారం.. కరోనా ప్రభావంతో సుమారు 3.2 కోట్ల మంది భారతీయులు మధ్య తరగతి నుంచి దిగజారిపోయారు. దీంతో టూ-వీలర్ వాహనాలపై ప్రతికూల ప్రభావం పడిందని’ వింకేష్ వివరించారు. అంతేకాకుండా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎంట్రీ లెవల్ కొనుగోళ్లలో ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed