‘నా భార్య పోటీ చేయడం లేదు.. బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి’

by Anukaran |
‘నా భార్య పోటీ చేయడం లేదు.. బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి’
X

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తన భార్య పోటీ చేయడం లేదని.. మేయర్ సీటు రేసులో ఉండరని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో టీ‌ఆర్‌ఎస్ పార్టీని 60 స్థానాల్లో గెలిపించి ప్రజలు తనకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. మేయర్ అభ్యర్థి‌గా తన భార్య వసంత లక్ష్మి పోటీ చేస్తున్నారన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఏ డివిజన్ నుంచి కూడా పోటీ చేయారని స్పష్టం చేశారు. ఇక ఖమ్మం నగర అభివృద్ధి కేవలం టీఆర్ఎస్‌తోనే జరిగిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండేదని పువ్వాడ విమర్శలు చేశారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రంగాల్లో డెవలప్ జరిగిందని.. వాస్తవాలు ప్రజలకు కూడా తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అభివృద్ధికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Next Story