- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోగా మంత్రి పువ్వాడ తనయుడు..? అందుకేనా ఈ కొత్త స్నేహాలు..
దిశ, సినిమా : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ మధ్య సినిమా సెలబ్రిటీలపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకో ఏమిటో తెలియదు కానీ రాజకీయ నాయకుల దోస్తానీ పక్కనపెట్టి స్టార్స్ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అది కూడా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇటు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన హీరోలను కలుస్తుండటం మరో విశేషం. కొడుకు నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అసలు వీరిద్దరిని కలవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
నయన్‌కు రాజకీయ వారసత్వం ఇవ్వకుండా హీరోగా పరిచయం చేయాలనే లక్ష్యంతోనే కొత్త పరిచయాలు పెంచుకుంటున్నారని సెటైర్లు, మీమ్స్ వస్తున్నాయి. ఏదైతేనేమీ కొడుకును పొలిటిషియన్‌గా కాకుండా కథానాయకుడిగా చూడాలనుకున్న తండ్రిగా మంచి పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ ఫొటోల్లో డైరెక్టర్ కొరటాల శివ కూడా దర్శనమివ్వగా ఆయన డైరెక్షన్లోనే నయన్‌ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారని టాక్. మొత్తానికి చిరు, తారక్‌ల మద్దతుంటే కొడుకు ఇండస్ట్రీలో గొప్పస్థాయికి ఎదగగలడు అనే నమ్మకంతో మంచి స్టెప్ తీసుకుంటున్నాడులే అని మెచ్చుకుంటున్నవారు కూడా లేకపోలేదు.