కొవిడ్ ​మార్గదర్శకాలతోనే పుష్కరాల నిర్వహణ

by srinivas |   ( Updated:2020-10-31 10:08:13.0  )
కొవిడ్ ​మార్గదర్శకాలతోనే పుష్కరాల నిర్వహణ
X

దిశ, ఏపీబ్యూరో: తుంగభద్ర పుష్కరాలను కొవిడ్ ​మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి తెలిపారు. శనివారం కర్నూలులో పుష్కర ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర తీరం వెంబడి 21 ఘాట్లలో పుష్కరాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రూ.230 కోట్లు వెచ్చించి ఘాట్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నంద్యాల చెక్​పోస్టు నుంచి వేసిన రోడ్డు, సంకల్ బాగ్, రాఘవేంద్ర మట్, పంప్ హౌస్, మునగాల పాడు, సుంకేసుల డ్యామ్ వద్ద పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను బుగ్గన తనిఖీ చేశారు. మంత్రితోపాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed