పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు?

by Jakkula Samataha |
పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరు?
X

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. తను ఎంచుకున్న సబ్జెక్ట్‌తో హీరోను స్టార్‌గా నిలబెడట్ట గల సత్తా ఉన్నోడు. పంచ్‌లు వేస్తూనే ప్రాక్టికల్ మెసేజ్ కూడా ఇవ్వగలడు. పోకిరీతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పూరీ.. తన తీసే ప్రతి సినిమా సబ్జెక్ట్ డిఫరెంట్‌గా ట్రై చేస్తాడు.

కాగా ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్న పూరీ.. ‘జనగణమ’న ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ సినిమా పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్న పూరీ.. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్స్‌ను కలిశాడు. కానీ వర్కవుట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. జనగణమన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, పవర్‌ఫుల్ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తామని తెలిపారు. బిగ్గెస్ట్ కాస్ట్ అండ్ క్రూతో సినిమా మరో లెవెల్‌లో ఉంటుందని.. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు ప్రకటించాడు. మరి ఇది మహేశ్‌తో తీస్తాడా? అనే దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వీరిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా.. ‘పూరీ కథ కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు మహేశ్’.. మరి పూరీ ఏం ఆలోచిస్తున్నాడనేది తెలియాల్సి ఉంది.

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఫైటర్ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న పూరీ.. జనగణమన కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందిస్తానని చెప్పడంపై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. పూరీ నుంచి వచ్చే ప్రతీ సినిమా నేషనల్ లెవెల్‌లో ఉండాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed