దీప్ సిద్దూ అరెస్ట్.. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా?

by Anukaran |   ( Updated:2021-02-08 23:22:38.0  )
దీప్ సిద్దూ అరెస్ట్.. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: పంజాబ్ నటుడు, సింగర్ దీప్ సిద్ధూను పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 26న ఎర్రకోట ముట్టడి వెనక దీప్ సిద్దూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా రైతు ఉద్యమంలో దీప్ సిద్దూ హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాదు దీప్ సిద్దూ ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డ్ ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈరోజే ఎట్టకేలకు దీప్ సిద్దూను పోలీసులు అరెస్ట్ చేశారు.

దీప్ సిద్దూ ఏం చేశాడు

జనవరి 26న కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతు గణతంత్ర పరేడ్ పేరిట ఢిల్లీలో రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తత పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఎర్రకోట వేదికగా జరిగిన విధ్వంసం తర్వాత పంజాబ్ సింగర్, నటుడు దీప్ సిద్దూ పేరు ప్రముఖంగా వినిపించింది. అల్లర్లకు కారణం దీప్ సిద్దూయేనని పోలీసులు తమ ప్రాధమిక విచారణలో నిర్ధారించారు. రైతుల సంఘాల నేతలు సైతం ప్రకటించారు. శాంతియుతంగా తాము జరపాలనుకున్న ర్యాలీలో దీప్ సింగ్ ఎంటర్ కావడంతో విధ్వంసం మొదలైందని రైతు సంఘాలు ఆరోపించాయి.

సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపాడా?

అయితే ఎర్రకోట ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారీ కేడ్లను దాటిన సిద్దూ యువతను రెచ్చగొట్టి అందరూ రెడ్ పోర్ట్ వైపు వెళ్లేలా చేశాడు. అనంతరం ఎర్రకోట ఎక్కి.. అక్కడ ఓ జెండాను ఎగురవేశాడు. ఆపై వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో దీప్ సిద్దూ సంఘవిద్రోహ శక్తులతో కలిసి విధ్వంసానికి పాల్పడ్డారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం అందుకు దీప్ సిద్దూ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీప్ సిద్దూ అజ్ఞాతంపై పోలీసులు స్పందిస్తూ లక్ష రివార్డ్ ప్రకటించారు. ఎవరైతే దీప్ సిద్దూను పట్టుకుంటారో వారికి ఈ పెద్దమొత్తాన్ని అందిస్తామని ప్రకటించారు. ఎట్టకేలకు ఈరోజులు దీప్ సిద్దూను ఢిల్లీపోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story