ఆ బ్యాంకుల లాభం రూ.1,097 కోట్లు!

by Harish |
ఆ బ్యాంకుల లాభం రూ.1,097 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం క్షీణించడం, కేటాయింపుల పెరుగుదల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రూ.990.80 కోట్లని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది రూ.543.48 కోట్లని బ్యాంక్ వెల్లడించింది. ఇక, మార్చితో ముగిసిన త్రైమాసికానికి బ్యాడ్ లోన్లకు అధిక కేటాయింపుల కారణంగా నికర నష్టం రూ.236.30 కోట్లకు పెరిగిందని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం 5.96 శాతం తగ్గి రూ.8,826.92 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.9,386.95 కోట్లుగా నమోదైంది. 2019-20, మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,289.43 కోట్లకు తగ్గినట్టు, అంతకుముందు ఇదే త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,304.37 కోట్లుగా నమోదైనట్టు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇక, వడ్డీ ఆదాయం పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.7,929.53 కోట్లకు తగ్గిందని, చివరి త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.1,904 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. ఇక, సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నిర్వహణ లాభం రూ.429.75 కోట్లను ఆర్జించిందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ లాభం రూ.1,096.91 కోట్లని తెలిపింది. స్థూల నిరర్ధక ఆస్తులు 14.18 శాతం పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు గతేడాది 7.22 శాతంతో పోలిస్తే ఈసారి 8.03 శాతానికి పెరిగాయి.

Advertisement

Next Story