రుణ గ్రహీతలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!

by Harish |   ( Updated:2021-09-17 10:48:03.0  )
Panjab bank
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో బ్యాంకులు గృహ, వాహన రుణాలపై ప్రత్యేక వడ్డీ తగ్గింపును ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం తన రెపో ఆధారిత రుణ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.80 శాతం నుంచి 6.55 శాతానికి తగ్గిస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. రెపో రేటు అనేది ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాల రేటు. గృహ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకులు రెపో రేటుకు లింక్ చేయడం ద్వారా రుణాలు తీసుకునేవారికి ప్రయోజనాలుంటాయి. ఆర్ఎల్ఎల్ఆర్ రేటు తగ్గడం వల్ల రుణం తీసుకున్న వారికి ప్రతి నెలా వడ్డీ తగ్గుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గించిన ఆర్ఎల్ఎల్ఆర్ తగ్గింపు నిర్ణయం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆర్‌బీఐ ఆదేశాల మేరకు పలు బ్యాంకులు ఇప్పటికే గృహ రుణాల వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానం చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల వినియోగదారులు తక్షణం ప్రయోజనాలు పొందుతారు.

Advertisement

Next Story

Most Viewed