అభిమానులకు కన్నీటి లేఖ రాసిన పునీత్ రాజ్‌కుమార్ భార్య..

by Shyam |
puneth rajkumar
X

దిశ, సినిమా: పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ఆయన సతీమణి అశ్వినీ పునీత్ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. పునీత్ అకాల మరణం తమ కుటుంబాన్నే కాదు కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. తనను పవర్‌ స్టార్‌గా చేసిన అభిమానులకు ఇది ఎంతటి బాధ కలిగిస్తుందో ఊహించడం కష్టమని అభిప్రాయపడింది. అయితే ఎంత బాధను అనుభవించినప్పటికీ.. ప్రశాంతత కోల్పోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటివ్వకుండా పునీత్‌కు గౌరవప్రదంగా వీడ్కోలు పలికినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది.

లక్షలాది మంది సంతాపానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్న అశ్వినీ పునీత్.. సినీ ప్రముఖులు మాత్రమే కాదు దేశ, విదేశాల నుంచి అన్ని వయసుల వారు పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారని, తన మరణాన్ని తట్టుకోలేకపోయారని చెప్పింది. వేలాది మంది.. ప్రియమైన అప్పూ మార్గాన్ని ఎంచుకోవడం తనను కన్నీరు పెట్టుకునేలా చేసిందన్న ఆమె.. నేత్రదానానికి రిజిస్టర్ చేసుకుని ఆదర్శంగా నిలవాలని కోరింది. ఆయన స్మృతి.. అభిమానుల్లో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నట్లుగా తెలిపింది.

Advertisement

Next Story