ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలి: పుల్లయ్య

by Sridhar Babu |
pullaiah4
X

దిశ, చిట్యాల: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఏవైఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపు మూలంగా సామాన్యులపై భారం పడుతుందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం సరైంది కాదన్నారు. లేని పక్షంలో సామాన్య ప్రజలతో పాటు దళితులంతా సంఘటితంగా ఉద్యమించి ఈ ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుర్రపు రాజేందర్, బొడ్డు ప్రభాకర్, రాజేందర్, ఆనందం, ప్రతాప్, సునీల్, తిరుపతి పాల్గొన్నారు.

Advertisement

Next Story