నాలుగేళ్ల విరామం తర్వాత ఆ పాఠశాల ప్రారంభం

by Sridhar Babu |
Public school
X

దిశ, అన్నపురెడ్డిపల్లి: విద్యార్థులు లేకపోవడంతో 2017లో మూతపడిన అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన మండల ప్రభుత్వ పాఠశాల గురువారం తిరిగి పున:ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ఎంఈవో ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ.. గుంపెన ప్రభుత్వ పాఠశాల పున:ప్రారంభానికి వైస్ ఎంపీపీ మామిళ్ళపల్లి రామారావు కృషే కారణమన్నారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాల తిరిగి ప్రారంభించాలని ప్రతిపాదించడంతో పాటు పాఠశాల ప్రారంభం అయ్యేవరకు తోడ్పాటు అందించారని వైస్ ఎంపీపీని అభినందించారు. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత 12 మంది విద్యార్థులతో పాఠశాల ప్రారంభించడంతో విద్యాశాఖ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, బాబూలాల్, శిరీష, సర్పంచ్ సురేష్, లక్ష్మణరావు, సుధాకర్, అజీమ్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed