- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్‌టెల్‌తో పబ్‌జీ చర్చలు!
దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన గేమింగ్ యాప్ పబ్‌జీ (pubg) తన అభిమానుల కోసం మళ్లీ భారత్ (india)లోకి మళ్లీ రావడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికోసం దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel)తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. సెప్టెంబర్ తొలివారంలో భద్రతా సమస్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం (central government) పబ్‌జీతో సహా పదుల సంఖ్యలో యాప్ (apps)లను నిషేధించిన సంగతి తెలిసిందే.
ఎన్‌ట్రాకర్ నివేదిక ప్రకారం..పబ్‌జీ మాతృసంస్థ అయిన పబ్‌జీ కార్పొరేషన్ (pubg corporation)భారత మార్కెట్ (indian market)లో తిరిగి కొనసాగేందుకు ఎయిర్‌టెల్‌తో ప్రాథమిక చర్చలను ప్రారంభించింది. అంతేకాకుండా, భారత్‌లోని కార్యకలాపాల నిమిత్తం సంస్థకు ప్రయోజనాలు కలిగేలా, మరింత సమర్థవంతంగా తమ ప్రయత్నాలను కొనసాగించే వారికోసం అన్వేషిస్తోంది. ఇందుకోసం 4 నుంచి 6 సంవత్సరాలోపు అనుభవం ఉన్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నివేదిక అభిప్రాయపడింది. ఇదివరకు ముఖేశ్ అంబానీ (mukesh ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (reliance industries) అనుబంధ సంస్థ జియో (jio)తో పబ్‌జీ గేమ్‌ను అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా బ్లూహోల్స్ గేమ్స్ (blue whale game) సంస్థ చర్చలు జరిపినప్పటికీ, తర్వాత చర్చలు నిలిచిపోయాయి. భారత్‌లో పబ్‌జీ యాప్‌ను నిషేధించిన తర్వాత అంతర్జాతీయంగా ఈ గేమ్ తీవ్రంగా ప్రభావితమైంది.
సెన్సార్ టవర్ (sensor tower) నివేదిక ప్రకారం..భారత్‌లో పబ్‌జీ నిషేధం వల్ల అంతర్జాతీయంగా పబ్‌జీ యాప్ డౌన్‌లోడ్ (download)లు 26 శాతానికి పైగా క్షీణించాయి. ఒకవేళ ఎయిర్‌టెల్‌తో చర్చలు సఫలమైతే, పబ్‌జీ అతిపెద్ద మార్కెట్‌ను దక్కించుకున్నట్టు అవుతుంది, అలాగే, భారత ఆన్‌లైన్ గేమింగ్ (online gaming) మార్కెట్లోకి ఎయిర్‌టెల్ ప్రవేశానికి సులభతరమవుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.