- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆకర్షణ మంత్రం.. దేహ పరిమళం?
దిశ, ఫీచర్స్: మగువల అందం.. మడి కట్టుకుని కూర్చున్న మగాళ్లనైనా ఆకర్షిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి రూప లావణ్యానికి మానవ మాత్రులే కాదు, మునులు సైతం దాసోహమవక తప్పలేదు. అయితే కేవలం వారి బాహ్య సౌందర్యమే అంతలా మంత్రముగ్ధుల్ని చేస్తుందా? ఇదే తీరున పురుషులు సైతం తమ అందంతో మహిళలను అట్రాక్ట్ చేయగలరా? అంటే కాదని చెప్పలేం. కానీ మేల్, ఫిమేల్ తమ అపోజిట్ జెండర్ పట్ల ఆకర్షితులు కావడంలో బ్యూటీ ఒక్కటే రీజన్ కాదు. శారీరక భాషతోపాటు దేహ పరిమళమూ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఒకవేళ తెలిసినా దాన్ని పెద్దగా పట్టించుకోం. ఒకసారి పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్‌కు సంబంధించి టీవీల్లో టెలికాస్ట్ అయ్యే ప్రకటనలను పరిశీలిస్తే వాటి ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది.
సుగంధ పరిమళాల మత్తులో అపోజిట్ జెండర్‌ను తమవైపుకు తిప్పుకోవచ్చనే థీమ్‌నే యాడ్స్‌లో ప్రజెంట్ చేస్తుంటాయి కంపెనీలు. ఒకరకంగా ఇది మార్కెటింగ్ స్ట్రాటజీనే అయినా, ఇందులో వాస్తవం లేకపోలేదు. సహజసిద్ధంగా ఒంటి నుంచి వెలువడే వాసనకు అందానికి మించిన ఆకర్షణ శక్తి ఉంటుంది. అంతేకాదు స్ట్రీ, పురుషులు ఎవరైనా దేహ పరిమళం ఆధారంగా భాగస్వామిని ఎంచుకుంటే వారిలో మంచి రీప్రొడక్టివిటీ సాధ్యమని అధ్యయనాలు చెబుతున్నాయి.
సహజంగా మన శరీరం వెదజల్లే వాసనలు.. అనారోగ్య సమస్యలను తెలపడమే కాక, మన ఆహార అలవాట్లను కూడా సూచిస్తాయని ఆస్ట్రేలియన్ యూనివర్సిటీకి చెందిన ఓల్‌ఫాక్షన్, ఓడర్ సైకాలజిస్ట్ మెహ్మెత్ మహ్మత్ తెలిపారు. ఈ విషయంపై కొన్ని అధ్యయనాలు విరుద్ధ అంశాలను లేవనెత్తగా.. ఎక్కువగా మాంసం తింటే బాడీ ఓడర్(బీవో) ఆహ్లాదంగా ఉంటుందని, తన బృంద పరిశోధనలో తేలిందన్నారు.
రుతుక్రమంలో అండాలు విడుదలైనప్పుడు..
మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో భాగంగా ఫాలిక్యులర్ ఫేజ్(అండాలు విడుదలయ్యే దశ)లో మహిళల బాడీ ఓడర్.. పురుషులను ఆకర్షిస్తుంది. రుతుస్రావం సమయంలో ఈ ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుండగా పునరుత్పత్తి కోసం ఉత్తమ భాగస్వాములను గుర్తించేందుకు పూర్వీకులకు ఈ విధానం ఉపయోగపడి ఉండవచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు. అంతేకాదు పురుషుల్లోని టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా వారిలో దేహ పరిమళాన్ని పెంచుతాయని వెల్లడించారు. అయితే ఇది మన డైట్, హెల్త్ ఆధారంగా మారడంతోపాటు జన్యు లక్షణాలు చెమట వాసనలోని ప్రత్యేకతను నిర్ధారిస్తాయని తెలిపారు.
జెనెటికల్‌గా సిమిలారిటీ లేకుంటే బెస్ట్ రీప్రొడక్టివిటీ..
కొందరు అపరిచితులైన ట్విన్స్(కవలల) గ్రూప్ సభ్యులకు చెందిన చెమటపట్టిన టీషర్ట్స్‌ను ఒకచోట చేర్చినపుడు.. వారిలోని ఒక్కో కవలల జంట టీ షర్ట్స్ పెయిర్‌ను స్పెసిఫిక్ బాడీ ఓడర్, అక్యురేట్ సెన్స్ ఆఫ్ స్మెల్ కలిగిన వ్యక్తులు గుర్తుపడతారని తేల్చింది. అంటే స్మెల్ ద్వారా వారి జెనెటిక్ సమాచారాన్ని తెలుసుకోగలమని నిరూపితమైంది. మరొక స్టడీలో భాగంగా.. కొందరు మహిళలకు పలువురు పురుషులు ధరించిన టీ-షర్ట్స్ ఇచ్చి, ఆ వాసన ఎంతవరకు ఆహ్లాదకరంగా ఉందో ర్యాంకింగ్ ఇవ్వమని సూచించారు. వారిచ్చిన ర్యాంకింగ్స్.. అచ్చం ‘హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్(HLA) డీసిమిలారిటీ’గా పిలువబడే ప్యాటర్న్‌ను పోలివున్నాయి. మన బాడీలో ఉన్న కణాలే.. ఇతరుల్లోనూ ఉన్నట్టయితే వాటిని గుర్తించేందుకు గ్రూప్ ఆఫ్ ప్రొటీన్స్ కలిగి ఉండేదే HLA. మన ఇమ్యూన్ సిస్టమ్‌కు సహాయపడే HLA ప్రొఫైల్ ప్రతీ ఒక్కరిలో వేరుగా ఉన్నా, దగ్గరి బంధువుల్లో పోలికలు ఉండొచ్చు. అందుకే జన్యు లక్షణాల పరంగా చూస్తే.. డీసిమిలర్ HLA ప్రొఫైల్ ఉన్నవారితో బిడ్డను కనడం ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే సెలెక్ట్ చేసుకున్న పార్టనర్‌కు మీకు మధ్య బాడీ ఓడర్‌తో పాటు ఇమ్యూన్ ప్రొఫైల్‌లో జెనెటికల్‌గా డీసిమిలారిటీ ఉంటే అది పుట్టబోయే పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుందని మరో సైకాలజిస్ట్ స్పష్టం చేశారు.
సెక్స్ లైఫ్‌పై ప్రభావం చూపుతుందా..?
నిజానికి ఒంటి వాసనలో దాగి ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి పార్టనర్‌ను సెలెక్ట్ చేసుకుంటారా? అంటే కాదనే చెప్పొచ్చు. దాదాపు 3700 మంది జంటల్లో నిర్వహించిన స్టడీలో చాలావరకు HLA డీసిమిలర్ పార్టనర్‌నే ఎంచుకున్నట్టు తెలిసింది. మనకు కొన్ని వాసనలంటే ఇష్టముండొచ్చు, అందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. కానీ వివాహం చేసుకున్నప్పుడు ప్రత్యేకించి బాడీ ఓడర్‌ను పరిగణలోకి తీసుకోం. అయితే HLA అనేది భాగస్వామి విషయంలో మన ఛాయిసెస్‌ను ప్రభావితం చేయకున్నా లైంగిక శ్రేయస్సుపై ఆ ప్రభావం చూపుతుందని స్టడీలో పేర్కొన్నారు. అంతేకాదు HLA డీసిమిలారిటీ గల జంటలు సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారని, పిల్లల్ని కనేందుకు ఉత్సాహంగా ఉంటారని తెలిపారు.
చెమట వాసనతోనే డేటింగ్ పార్టనర్ ఎంపిక..
బాడీ ఓడర్ ప్రిఫరెన్స్, జన్యులక్షణాల మధ్య లింక్.. టీ-షర్ట్ స్పీడ్-డేటింగ్, ‘మెయిల్ ఓడర్’ సేవలకు సంబంధించిన ట్రెండ్‌కు ప్రోత్సాహమిచ్చింది. పలు దేశాల్లో కొన్ని సంస్థలు ‘టీ-షర్ట్ స్పీడ్ డేటింగ్’ సేవలు అందిస్తున్నాయి. అంటే ముందుగా డేటింగ్ పార్టనర్ కోసం ఎదురుచూస్తున్న వారికి టీ-షర్ట్స్ పంపించి ఎటువంటి డియోడరెంట్స్ వాడకుండా 3రోజుల పాటు ధరించమని సూచిస్తాయి. ఆ తర్వాత జాగ్రత్తగా ప్యాక్‌చేసి పంపించమంటాయి. అలాగే ఇతరుల వద్ద నుంచి సేకరించిన చెమటపట్టిన దుస్తుల శాంపిల్స్‌ను వీరికి పంపించి నచ్చిన ఓడర్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తాయి. ఈ విధంగా ఓడర్స్ మ్యాచ్ అయిన వారిని జంటగా సెట్ చేస్తాయి. కానీ వాసన ఆధారంగా డేటింగ్ పార్టనర్‌ను నిర్ణయించుకోవచ్చనే ఆలోచనకు స్పష్టమైన ఆధారాలేవీ లేవు. సింపుల్‌గా మేము దేన్నయినా ఇష్టపడతామని అనవచ్చు కానీ ప్రాక్టికల్‌గా ఇందులో చాలా క్లిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే వాసన నచ్చినా ఒక్కోసారి రూపం నచ్చకపోవచ్చని, ఫోటోను చూపించినప్పుడు అయోమయంలో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
టెస్టోస్టిరాన్ ఎక్కువున్న పురుషుల్లో స్ట్రాంగ్ స్మెల్..
ఇక మరో స్టడీలో భాగంగా.. పెళ్లైన మహిళల భర్తల టీ-షర్ట్స్, సింగిల్ ఉమెన్‌కు చెందిన మేల్ ఫ్రెండ్స్ టీ-షర్ట్స్‌తో పాటు మరికొందరు అపరిచితుల టీ-షర్ట్స్‌ను మిక్స్ చేసి, స్మెల్ ఆధారంగా సెలెక్ట్ చేయమని సూచించారు. ఈ సందర్భంలో మ్యారీడ్ ఉమెన్ తమ హస్బెండ్ టీషర్ట్‌ను గుర్తించకపోవడం గమనార్హం. అంతేకాదు పెళ్లైన పురుషుల బాడీ ఓడర్ కంటే బయటివ్యక్తులే స్ట్రాంగ్ స్మెల్ కలిగి ఉన్నట్టు తేలింది. దీన్ని బట్టి అధిక టెస్టోస్టిరాన్ లెవెల్స్, స్ట్రాంగ్ బాడీ ఓడర్ మధ్యన పరస్పర సంబంధం ఉన్నట్టు బయటపడింది. 40 ఏళ్లు దాటి పెళ్లయ్యి, పిల్లలున్న వ్యక్తుల్లో సాధారణంగా టెస్టోస్టిరాన్ తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్‌గా చెమట వాసనలోనూ స్ట్రాంగ్‌నెస్ తగ్గుతుందనే విషయం స్పష్టమైంది.