‘సైకో వర్మ’ షూటింగ్ స్టార్ట్

by  |
‘సైకో వర్మ’ షూటింగ్ స్టార్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సైకో వర్మ. వీడు తేడా అనేది క్యాప్షన్. ఇందులో కథానాయకుడు వర్మ అభిమాని కాగా.. వయోలెన్స్, రొమాన్స్ మిళితమైన పాత్రలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్తున్నారు. ఆర్జీవీ కూడా ఈ సినిమాలో కనిపిస్తుండటం విశేషం.

ఒకప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న వర్మ.. తన రూట్ మార్చి ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేస్తున్నాడనే నేపథ్యంలో ‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి’ లిరికల్ సాంగ్ ఈ మధ్యే విడుదలైంది. కాగా, ఈ సాంగ్‌తోనే బుధవారం చిత్రీకరణ మొదలు పెట్టింది మూవీ యూనిట్. నట్టి కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో స్టార్ట్ కాగా.. నటనా ప్రాధాన్యమున్న పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు హీరో నట్టి క్రాంతి. ఓ వైపు నటుడిగా రాణిస్తూనే మరో వైపు నిర్మాతగానూ కొనసాగుతానని తెలిపారు.

ఇక చిత్రీకరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీనియర్ ఫిలిం ఎడిటర్ గౌతమ్ రాజ్ తొలి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా.. నిర్మాత నట్టి కరుణ కెమెరా స్విచాన్ చేశారు. సినిమాలో కృష్ణ ప్రియ హీరోయిన్ కాగా.. అప్పాజీ, చమ్మక్ చంద్ర, మీనా, రూప లక్ష్మి, కబుర్లు నవ్య, రమ్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టి కుమార్
నిర్మాతలు: నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల
DOP: జనార్ధన్ నాయుడు
సంగీతం: ఎస్. ఎ. ఖుద్దూస్

Advertisement

Next Story