ఈ మానసిక రోగి నయం !

by Shyam |   ( Updated:2020-03-27 03:52:34.0  )
ఈ మానసిక రోగి నయం !
X

దిశ, ఆదిలాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే.. ఇప్పటికీ కొన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు పట్టించుకోకపోవడం బాధాకరం. ఒక దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం.. ’21 రోజులు లాక్ డౌన్ పాటించండని.. తాను ప్రధానిగా చెప్పడం లేదని, ఒక కుటుంబ సభ్యుడిగా చెబుతున్నానని’ చెప్పినా జనం పట్టించుకోకపోవడం చూస్తుంటే వీళ్ళు ఏం చేస్తే మారతారన్న ప్రశ్న వేధిస్తోంది. ప్రభుత్వం రోజూ ఉదయం నిత్యావసరాల కొనుగోలు కోసం వెసులుబాటు కల్పిస్తుంటే జనం దీన్ని సాకుగా తీసుకుని గుంపులు గుంపులుగా తిరుగుతుండటం గమనార్హం.

ముఖ్యంగా చదువుకున్న వాళ్లు కూడా ఈ కరోనా కట్టడిని ఒక శిక్షగా భావిస్తున్నా.. ఇక్కడో మానసిక రోగి మాత్రం ప్రస్తుత పరిస్థితులను చూసి కరోనాకు దూరంగా ఉంటున్నాడు. కరోనా రాకుండా మాస్కులతో జాగ్రత్త పడుతున్న ఇతడి తీరు చూసైనా ఈ జనం మారతారా లేదా అన్నది అనుమానమే ?

Tags : Lock down, Corona, People Negligence, Psychiatric Patient, Mask

Advertisement

Next Story

Most Viewed