కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టడానికి నిరసనలు..

by Shyam |
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టడానికి నిరసనలు..
X

దిశ,యాచారం: ధాన్యం కొనుగోలుపై చేతులేత్తిసిన కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ.. నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం ఉదయం పది గంటలకు యాచారం మండల కేంద్రంలో జరిగే నిర‌స‌న‌ కార్యక్రమానికి రైతులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొండాపురం శ్రీశైలం కొరారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.

నిర‌స‌న కార్యక్రమంలో భాగంగా బీజేపీ, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం చేతులేత్తేసిన విష‌యాన్ని రైతుల‌కు స్పష్టంగా వివ‌రించాల‌ని చెప్పారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేయాల‌ని శ్రీశైలం తెలంగాణ రైతాంగాన్ని కోరారు. యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమన్న విషయాన్ని రైతులు గమనించాలని అయన కోరారు. కాబట్టి ప్రతి ఒక్కరూ హాజరై నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Next Story