- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాయి బ్రాహ్మణున్ని నడి రోడ్డున పడేసిన పాలకమండలి..
దిశ, యాదగిరిగుట్ట : గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి తన నివాస గృహం,స్థలం తీసుకుని మరోచోట ఇప్పిస్తామని ఐదేళ్ల యినా పట్టించుకోక పోవడంతో ఓ కుటుంబం నిరసన చేపట్టింది. రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామానికి చెందిన జంపాల ప్రకాష్ కుటుంబం గ్రామ పంచాయతీ భవనం ఎదుట మంగళవారం సాయంత్రం నుండి వంటా వార్పు చేస్తూ నిరసన తెలిపారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..రఘునాథపురం గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి నిధులు రూ.12 లక్షలతో పాటు మరో రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సరిపడా స్థలం లేకపోవడంతో పొరుగున ఉన్న జంపాల ప్రకాశ్ కు చెందిన 170 గజాల స్థలాన్ని గ్రామ పెద్దల సమక్షంలో తీసుకొని భవనం నిర్మించి పాలన కొనసాగిస్తున్నారు. తమ స్థలానికి బదులుగా గ్రామ శివారులోని వసతిగృహం ఆవరణలో 240 గజాల స్థలంతోపాటు, ప్రభుత్వ పరంగా రెండు పడక గదుల ఇల్లు నిర్మి స్తామని అప్పటి సర్పంచి, గ్రామ పెద్దలు హామీ ఇచ్చినట్లు బాధి తుడు తెలిపారు. అప్పటి నుంచి తాము అద్దె గదిలోనే ఉంటున్నా మని, గ్రామపెద్దల హామీ నెరవేరలేదని వాపోయారు. తమ సమస్య పరిష్కరించే వరకు గత రెండు రోజుల నుంచి చీకట్లో వంటావార్పు చేస్తూ నిరసన తెలుపుతున్నామన్నారు. ఇక నైన అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని భాదిత కుటుంబం వేడుకుంటున్నారు. తాము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినా ప్రకాశ్ అంగీకరించటం లేదని, ఉన్నతాధికారుల సూచన మేరకు నడుచుకుంటామని సర్పంచ్ గాడిపల్లి శ్రవణకుమార్ తెలిపారు.
- Tags
- land issue