సజ్జల రామకృష్ణారెడ్డికి నిరసన సెగ.. వరద బాధితులు ఫైర్

by Anukaran |
sajjala
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు వరద బాధితుల నిరసన సెగ తగిలింది. వివరాల ప్రకారం.. సజ్జల మంగళవారం అన్నమయ్య జలాశయం కట్టతెగి ముంపునకు గురైన పులపుత్తూరు, గుండ్లూరు, మందపల్లి, తొగురుపేట గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా తాము సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. పులపుత్తూరు గ్రామస్తులు ఆయన ఎదుటే ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా జలాశయాలు కట్టలు తెగి ప్రాణ, ఆస్తినష్టం జరిగిందన్నారు. వరదల్లో ఇళ్లను కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఐదు సెంట్ల స్థలంలో కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు కొంత శాంతించారు.

Advertisement

Next Story

Most Viewed