- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జా కోరల్లో నుండి సర్కార్ స్థలాన్ని కాపాడండి
దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ సర్వేనెంబర్ 28లోని ప్రభుత్వ భూమిని కబ్జా కోరల్లో నుండి కాపాడాలని కోరుతూ ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. మియాపూర్ లక్ష్మీనగర్ కాలనీని ఆనుకుని సర్వేనెంబర్ 28లో ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 2వేల గజాల స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం జరుగుతుందని, ఇప్పటికే అక్రమార్కులు స్థలం చుట్టూ రేకులను ఏర్పాటు చేశారని అన్నారు. గతంలోను ఇదే మాదిరిగా 700 గజాల స్థలాన్ని కబ్జా చేసి రియల్టర్లు అబాడ్ ట్రెండ్స్ పేరుతో ఐదంతస్థుల నిర్మాణం చేపట్టి కోట్లు గడించారని అన్నారు. భవన నిర్మాణ దశలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, తాజాగా కొనసాగుతున్న అక్రమాన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని పల్లె మురళీ కోరారు.