ప్రొఫెసర్ దారుణం.. సీఎం జగన్ ఇలాకాలో సంచలన ఘటన

by Anukaran |   ( Updated:2021-07-28 04:23:43.0  )
ప్రొఫెసర్ దారుణం.. సీఎం జగన్ ఇలాకాలో సంచలన ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ మహిళలకు సేఫ్టీ ఉండడం లేదు. గుడి, బడి, ఆఫీస్, రోడ్డు ఇలా ఎక్కడ పడితే అక్కడ మగాళ్లు మృగాళ్లు గా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇందులో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులు, ఉపాధ్యాయులు ఉండడం విచారకరం. తాజాగా ఒక ప్రొఫెసర్ తన మహిళా సహోద్యోగిని లైంగికంగా వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అందులోనూ ఈ ఘటన సీఎం జగన్ ఇలాకా లో జరగడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని సీఎం సొంత జిల్లా కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ రాసలీలల బాగోతం బయటపడింది. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఒక డిపార్టుమెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి(46).. అదే డిపార్టుమెంట్ కి చెందిన మహిళా ప్రొఫెసర్ ని ఆదివారం కాలేజ్ కి రమ్మని తెలిపాడు. ఆదివారం సెలవు కదా అని అడిగితే.. అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పని ఉందని తప్పకుండా రావాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. ప్రొఫెసర్ రమ్మంటే రాను అని చెప్పలేక ఆమె సరే అని తల ఊపింది.

క్యాంపస్ కి వెళ్లిన ఆమెను ప్రొఫెసర్ తన పర్సనల్ రూమ్ కి తీసుకువెళ్లి ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ.. అక్కడక్కడా చేతులు వేయడం ప్రారంభించాడు. దానికి ఆమె అడ్డుచెప్పడంతో ఉద్యోగం పోతుందని బెదిరించాడు. దీంతో మహిళా ప్రొఫెసర్ తన ఫోన్ లో ఆ మాటలను రికార్డ్ చేసి సహోద్యుగులకు పంపడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఆ కామాంధుడు అంతకు ముందు తమను కూడా ఇలాగే వేధించాడని ఇతర ఉద్యోగినిలు కూడా తెలపడంతో అతడిపై విశ్వవిద్యాలయం ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story