- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీనా గుప్తాకు ‘రామానుజన్ పురస్కారం’
దిశ, ఫీచర్స్ : కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, గణిత శాస్త్రవేత్త నీనా గుప్తా 2021కి గాను ‘రామానుజన్ ప్రైజ్’ అందుకుంది. అఫిన్ ఆల్జీబ్రిక్ జామెట్రీ, కమ్యుటేటివ్ జామెట్రీలో చేసిన విశేష కృషికి గాను ఆమె ఈ అవార్డు సాధించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని యువ గణిత శాస్త్రవేత్తలకు ఈ బహుమతి అందిస్తుండగా.. భారతదేశం నుంచి నీనా గుప్తా నాలుగో వ్యక్తి అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2005 నుంచి ‘రామానుజన్ ప్రైజ్’ ప్రదానం జరుగుతుండగా.. ‘అబ్దుస్ సలామ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ (ICTP)’ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST), ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ (IMU) సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నాయి. బీజగణింతంలో నీనా చేసిన విశిష్ట కృషికి ‘రామానుజన్ పురస్కారం’ దక్కింది. కోల్‌కతాకు చెందిన నీనా.. 2006లో బెటూన్ కళాశాల నుంచి మ్యాథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. 2008లో ఐఎస్ఐ నుంచి గణిత శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత ఆల్జీబ్రా జామెట్రీ విభాగంలో పీహెచ్‌డీ కంప్లీట్ చేసింది. ఇక 2014లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి యంగ్ సైంటిస్టు పురస్కారం కూడా అందుకున్న ఆమె.. 2019లో ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ బహుమతి స్వీకరించింది. ఇలా తన ప్రయాణంలో నీనా ఎన్నో అవార్డులు పొందింది.