- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాంబే హైకోర్టులో ప్రొ. సాయిబాబా బెయిల్ దరఖాస్తు
ముంబై: మహారాష్ట్ర నాగ్‌పూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా బాంబే హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు. ఆ జైలులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఇప్పటికే అనారోగ్యంతో సతమతమవుతున్న తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నాగ్‌పూర్ బెంచ్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణ జరపాలని అభ్యర్థించిన ఈ బెయిల్ ప్లీపై సమాధానమివ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం సహా ఇతర రెస్పాండెంట్స్‌లకు న్యాయమూర్తులు అతుల్ చందుర్కర్, అమిత్ బొర్కర్‌ల డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోపు వివరణ ఇవ్వాలని, అదే రోజు విచారణ ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా శిక్ష అనుభవిస్తున్న నాగ్‌పూర్ జైలులో సుమారు 150 మంది ఖైదీలు, 40 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. ఈ జైలులో మొత్తంగా దాదాపు 1,800 మంది ఖైదీలు, 265 మంది సిబ్బంది ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలు, దేశానికి వ్యతిరేకంగా కుట్ర ఆరోపణలను విచారించి గడ్చిరోలి జిల్లా సెషన్ కోర్టు 2017 మార్చిలో ప్రొఫెసర్ సాయిబాబా సహా ఓ జర్నలిస్టు, జేఎన్‌యూ విద్యార్థికి జైలు శిక్ష విధించింది. ఉపా(యూఏపీఏ) కింద సాయిబాబాను దోషిగా ప్రకటించింది.