ఉత్పత్తిదారులు సామాజిక బాధ్యతతో మెలగాలి

by Sampath |

దిశ, వరంగల్: ఉత్పత్తిదారులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పంపిణీదారులతో శనివారం హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో ప్రత్యేక సమవేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంతో ప్రజలందరు ఇండ్లకే పరిమితమయ్యారని చెప్పారు. వారికి నిత్యావసర వస్తువుల అవసరం దృష్ట్యా ఎక్కడ కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. నిత్యావసర వస్తువుల సరఫరా, ధరల నియంత్రణపై పర్యవేక్షించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక అధికారితో పాటు, కమిషనరేట్ పరిధిలో అదనపు డి.సి.పి స్థాయి అధికారిని నోడల్ అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నూరు శాతం వస్తు ఉత్పత్తి చేసేందుకుగాను సంబంధిత పరిశ్రమలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు నిత్యావసర వస్తువులను సకాలంలో అందజేయడమే లక్ష్యంగా ఉత్పత్తిదారులు సామాజిక బాధ్యతగా సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అదనపు డి.సి.పి తిరుపతి, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: CP ravindar, meeting, Product, Essential commodities, warangal

Advertisement

Next Story

Most Viewed