- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అశ్వనీదత్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ….
దిశ, వెబ్ డెస్క్: సినీ నిర్మాత అశ్వనీదత్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. భూ సేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. కాగా వాదనలు విన్న కోర్టు… దీనిపై ఫైనల్ కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీఏకు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా గన్నవరం ఏయిర్ పోర్టు విస్తరణ కోసం ఆయన తన 39 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వానికి ఇచ్చినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి బదులుగా అంతే విలువగల భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం ఆయనకు హామి ఇచ్చినట్టు పిటిషన్ లో తెలిపారు. కాగా ఇప్పుడు రాజధాని తరలింపుతో అక్కడ భూమి విలువ గణనీయంగా పడిపోయిందనీ తెలిపారు. దీంతో భూసేకరణ చట్టం 2013 ప్రకారం తనకు నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరిన సంగతి తెలిసిందే.