ఫ్యామిలీకి శాపంగా మారిన ‘ధరణి’.. అంధకారంలోకి ఆ ‘నలుగురి’ జీవితాలు

by Shyam |
ఫ్యామిలీకి శాపంగా మారిన ‘ధరణి’.. అంధకారంలోకి ఆ ‘నలుగురి’ జీవితాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భూ పరిపాలనలో దేశమే అబ్బురపడుతోన్న ‘ధరణి’ పోర్టల్​ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అందరి పేరిట ఉన్న భూములపై హక్కులను ప్రశ్నార్ధకంగా మార్చింది. కుటుంబంలో నలుగురు ఉంటే అందరూ ధరణి బాధితులుగా మారారు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఏ ఒక్కరి సమస్య కూడా పరిష్కారం కాలేదు. వారి తప్పేమీ లేకపోయినా సొంత భూములపై ఎలాంటి హక్కుల్లేవంటూ రికార్డులను మార్చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన అనంతుల రాజిరెడ్డి, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు.. మొత్తం కుటుంబమే ధరణి పోర్టల్​బాధితులుగా రికార్డులకెక్కారు. చేసేదేమీ లేక మాడ్యూళ్ల ద్వారా దరఖాస్తు చేసుకొని అధికారుల కనికరం కోసం ఎదురుచూస్తున్నారు. తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. వాళ్లు ఏ తప్పు చేయకపోయినా, ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న భూమిపై హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు.

ప్రతీ గ్రామంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకనూ భూమి హక్కుల పరీక్షలు చేయించుకోని వారి సంఖ్య 80 శాతానికి పైగానే ఉన్నది. ప్రస్తుతం క్రయ విక్రయాలకు కోసం ప్రయత్నిస్తున్న వారు మాత్రమే ధరణి పోర్టల్​లేదా మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్తున్నారు. ఎలాగూ రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయన్న ధీమాతో రైతాంగం ఉన్నది. కానీ, ఆ సొమ్ము అందుతున్నా వారి భూ హక్కులను వివిధ కొర్రీలతో రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నమోదు చేశారని గ్రహించడం లేదు. ఓ వైపు కుటుంబాలే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించిందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

కుటుంబానికి శాపం..

– అనంతుల రాజిరెడ్డికి తన పేరు మీద ఉన్న సర్వే నం.98/3/1లోని 0.16 ఎకరాల భూమి కంటే తక్కువ విస్తీర్ణం ధరణిలో నమోదైంది.

– ఆయన భార్య అనంతుల ధనలక్ష్మి పేరు మీద ఉన్న సర్వే నం.100/4లోని ఐదు ఎకరాల భూమి కోర్టు కేసులో ఉన్నట్టు చూపిస్తోంది. కానీ, ఆ భూమిపై ఎలాంటి కేసులు లేవు.

– ఇద్దరు కొడుకుల మీద ఉన్న భూమిపై ఓవర్ ల్యాపింగ్​సర్వే నంబరు అని చూపిస్తున్నది. అనంతుల సునీల్​రెడ్డికి సర్వే నం.111/8లో ఎకరం, అనంతుల వెంకట్​రెడ్డికి సర్వే నం.111/7లో ఎకరం వంతున భూమి ఉన్నది. మొత్తం ఫ్యామిలీకి చెందిన భూమి.. గొప్పగా చెప్పుకుంటున్న ధరణి వల్లే సమస్యలు ఎదుర్కొంటున్నది.

Advertisement

Next Story

Most Viewed