నటనకు విక్రమ్ స్వస్తి.. కారణం కొడుకేనా?

by  |
నటనకు విక్రమ్ స్వస్తి.. కారణం కొడుకేనా?
X

హీరో విక్రమ్ సినిమాల్లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. అయితే కొడుకు ధృవ్ విక్రమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో విక్రమ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. కొడుకు కెరియర్ ను దృష్టిలో ఉంచుకుని విక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని మీడియాలో న్యూస్ రావడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. అదేంటి విక్రమ్ సినిమాలకు శాశ్వతంగా దూరం కావడం ఏంటని బాధపడుతున్నారు. విక్రమ్ తప్పకుండా సినిమాల్లో కొనసాగాలని కోరుతున్నారు.

దీంతో ఈ వార్తలపై స్పందిస్తూ… విక్రమ్ పిఆర్వో బదులిచ్చారు. ప్రస్తుతం కోబ్రా సినిమాతో బిజీగా ఉన్న విక్రమ్… సినిమాలకు స్వస్తి చెప్తారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కోబ్రా తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో ఓ సినిమా, 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారని ప్రకటించారు. దీంతో అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు సమాధానం దొరికింది.

Tags: Vikram, Dhruv Vikram, Kollywood, PRO

Advertisement

Next Story