రామ్ పోతినేనితో రొమాన్స్‌కు శ్రీకారం హీరోయిన్?

by Shyam |
priyanka arul mohan ..ram potineni
X

దిశ, సినిమా : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘రెడ్’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా.. స్టైలిష్‌గా ఉంటూనే మాస్ ఎలిమెంట్స్‌తో అలరిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్.. సెకండ్ హీరోయిన్‌ కోసం ప్రియాంక అరుల్ మోహన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ప్రియాంక ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్, శ్రీకారం’ చిత్రాలతో ప్రేక్షకులకు ‘ప్రియ’మైన నటిగా మారింది.

Advertisement

Next Story