- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగాల్ లో మోగిన ఉపఎన్నిక నగారా.. దీదీని ఢీ కొంటానంటున్న ఆ నేత..
దిశ వెబ్ డెస్క్ : మత బెనర్జీ మరో సంగ్రామానికి సిద్దమైంది. ఏ సభలోనూ అభ్యర్ధి కాకుండా ఆరు మాసాలు నెట్టుకు రావచ్చు , అయితే తర్వాతైనా ఎన్నిక కావల్సిందే కాబట్టి తన కంచుకోటను సిద్దం చేసుకుంటోంది. మండలి లేని బెంగాల్ లో మండలి తీసుకురావాలని మొదట్లో గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే బీజేపీ కేంద్రం లో ఉన్నంత వరకూ తన పప్పులు ఉడకవు అని తెలుసుకున్న దీదీ.. భవానీ పూర్ వైపు చూస్తోంది. బెంగాల్ బెబ్బులి కోసం ఇప్పటికే భవానీ పూర్ ఎమ్మెల్యే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్థానంతో పాటు ముందుగా ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన మరో రెండు స్థానాలకు కలిపి ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమీషన్.
మూడు సార్లు వరసగా బెంగాల్ కోటపై గడ్డి పూవులు పూయించిన దీదీ తన కుర్చీని మాత్రం నిలుపుకోలేక పోయింది. నమ్మిన బంటు సువేందు అధికారిని ఎలాగైనా సాగనంపాలని కంకణం కట్టుకుని మరీ రాజకీయ రంగంలోకి దూకి చతికిలా పడింది. నందిగ్రామ్ ను కంచుకోటగా చేసుకున్న సువేందును మాత్రం ఢీ కొట్టలేక పోయింది. ఓటమితో వెనుదిరిగిన దీదీకు రాజ్యాంగం మరో అవకాశం కల్పించింది. గెలుపు అనివార్యం అయిన దశలో తప్పక మళ్లీ భవానీ పూర్ లో నిలబడింది.
కలకత్తా కోటపై కాషాయం జెండా ఎగరేయాలని బీజేపీ మొదటి నుంచీ అనుకుంటోంది. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో గెలుపు గుర్రాలని రంగంలోకి దిగింది. చేతికి అంది వచ్చిన వారందరినీ పార్టీలోకి చేర్చుకుని దీదీకి చెక్ పెట్టాలని చూసింది. అయితే కాంగ్రేస్ , కమ్యూనిస్ట్ ల అడ్రస్ లేకుండా చేయగలిగింది కానీ బీజేపీ మాత్రం పాగా వేయలేక పోయింది. గెలిచిన 75 మంది ఎమ్మెల్యేల్లో కొందరు మమత దూకుడు తట్టుకోలేక తిరిగి తృణముల్ తీర్ధం పుచ్చుకున్నారు. మిగిలిన వాళ్లు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు.
తాజాగా మరోసారి బెంగాల్ లో ఎన్నికల నగారా మోగింది. మమత.. ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నికకావాల్సిన ఉండటంతో, దీంతో భవానీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోబన్‌దేవ్ చటోపాధ్యాయ్.. మమతా బెనర్జి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బెంగాల్ లో మిగిలి ఉన్న మూడు స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న ఓట్లను లెక్కిస్తారు. దీంతో.. బీజేపీ నుంచి ఎవరు పోటీకి దిగుతారనే ఉత్కంఠ కనిపించింది.
తాజాగా బీజేపీ భవానీ పూర్ తో పాటుగా ఉప ఎన్నికలు జరిగే రెండు స్థానాల ఉప ఎన్నికలకు అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించింది. భవానీపూర్ నుంచి టీఎంసీ అభ్యర్థినిగా పోటీచేస్తున్న సీఎం మమతాబెనర్జీపై బీజేపీ అభ్యర్థినిగా ప్రియాంక తిబ్రేవాల్ ను కమలనాథులు బరిలోకి దింపుతున్నారు. బీజేపీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులో పోరాడుతున్న లాయర్ ప్రియాంక తిబ్రేవాల్ మమతాబెనర్జీపై పోటీకి దింపింది.
41 ఏళ్ల ప్రియాంక తిబ్రేవాల్ కోల్ కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది. ఈమె 2014 లో భారతీయ జనతా పార్టీలో చేరింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ప్రియాంక తిబ్రీవాల్ కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2014లో ఎంపీ బాబుల్ సుప్రియో నేతృత్వంలో ఆమె బీజేపీలో చేరారు.
ఉప ఎన్నికలు జరగనున్న శంశేర్ గంజ్ కు మిలాన్ ఘోష్, అదే విధంగా జాంగీపూర్ నుంచి సుజిత్ దాస్ ను పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించింది. అయితే, ఈ ఉప ఎన్నికలు ఇప్పుుడు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఉప ఎన్నికల పైనే ఆశ పెట్టుకున్న మమత బెనర్జీ గెలుపుకోసం అన్ని అస్త్రాలు వాడుకుంటోంది. అన్నిటికంటే రాష్ట్ర ముఖ్యమంత్రే అభ్యర్థి గా నిలబడటం తో దేశం మొత్తం బెంగాల వైపే చూస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నిక దీదీకి నల్లేరు మీద నడకే అన్నట్టు కనిపిస్తున్నా, ఓటరు ఎటు వైపు నిలుస్తాడనే దాని పైనే దీదీ భవిష్యత్తు ఆధార పడి ఉంది.