ఆ హీరోయిన్ నిశ్చితార్థపు ఉంగరానికి రూ.2 కోట్లు

by Shyam |   ( Updated:2021-11-10 09:23:28.0  )
priyanka-chopra12
X

దిశ, సినిమా: ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ జాబితాలో ప్రియాంక చోప్రా-నిక్ జోనస్ తప్పకుండా ఉంటారు. 2018లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. తమ కెమిస్ట్రీతో నిత్యం జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటారు. నిక్ గురించి చెప్పేటప్పుడు ప్రియాంక కళ్లల్లో కనిపించే మెరుపు చాలు.. వారిద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే, రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రియాంక తన నిశ్చితార్థపు ఉంగరాన్ని గుర్తుచేసుకుంది. తన దగ్గరున్న మోస్ట్ స్టన్నింగ్ జ్యువెలరీ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను ధరించే ఆభరణాల పట్ల చాలా సెంటిమెంట్‌గా ఉంటాను. నా ఎంగేజ్‌మెంట్ రింగ్ విషయంలో ఇది కాస్త ఎక్కువ. ఎందుకంటే నిక్ ప్రజెంట్ చేసిన ఆ ఉంగరం నాకు ఊహించని గిఫ్ట్. ఇది నాకు సంబంధించిన అనేక జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది’ అని చెప్పింది. దాదాపు రూ. 2.1 కోట్ల విలువైన రింగ్‌ను తమ నిశ్చితార్థం రోజున ప్రియాంకకు బహూకరించాడు నిక్.

ఫ్రాన్స్ హోటల్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో సెక్సీ బ్యూటీ.. త్వరలో చూస్తారంటూ

బ్యాంక్‌ ఖాతాలను డీఫ్రీజ్ చేయండి.. కోర్టుకెక్కిన రియా చక్రవర్తి

Advertisement

Next Story