ప్రియాంక‌ చోప్రా విడాకులు.. విచారం వ్యక్తం చేసిన ఆమె త‌ల్లి..!

by Shyam |
priyanka
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా దాదాపు 10 ఏళ్ల చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రియాంక పెళ్లి కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోతున్నారంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. దీనికి కారణం ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్లో‌ తన పేరు మార్చిడమే. పెళ్లి తర్వాత తన భర్త పేరు నిక్ పేరును తన పేరుతో జత చేసుకున్న పీసీ.. ఇప్పుడు ఈ పేరును తొలగించింది. దాంతో ప్రియాంక – నిక్ విడిపోతున్నారన్న ప్రచారం మరింత జోరందుకుంది.

ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించింది. తాజాగా ఆమె న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీ – నిక్ విడాకులపై క్లారిటీ ఇచ్చారు. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా మాట్లాడుతూ.. ప్రియాంక – నిక్ విడాకులు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక- నిక్ విడిపోవడంలేదని అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇలాంటి అసత్య ప్రచారాలను అభిమానులు నమ్మవద్దని ఆమె కోరారు.

2018లో పెద్దలను ఒప్పించి ఒక్కటైన ప్రియాంక- నిక్ తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. వీరిద్దరి సంబంధించిన ఫొటోలు నిత్యం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఈ జంట సందడిగా జరుపుకున్నారు. నిక్ పేరును ప్రియాంక ఎందుకు తొలగించారంటూ సినీ వర్గాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చర్చించుకుంటున్నారు.

కాగా ఇటీవల టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ నాగ చైతన్య-సమంతలు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విడాకుల ప్రకటనకు ముందుకు సామ్ తన సోషల్‌ మీడియా ఖాతాలు ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ల్లో అక్కినేని పేరు తొలగించి ఎస్‌ అనే అక్షరం మాత్రమే పెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక కూడా తన సోషల్‌ మీడియా ఖాతాల పేర్లను మార్చడంతో ప్రియంక-నిక్‌కు మధ్య కూడా సంబంధం చేడిందా? అంటూ ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.

Advertisement

Next Story