- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్లోబల్ స్టార్ ప్రియాంక రిపబ్లిక్ డే స్పెషల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ఆమె.. భారత మొదటి రాజ్యాంగ సభలో మహిళలు, భారత రాజ్యాంగ రూపకల్పనలో వారి పాత్ర గురించి ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా పాలనలో ఉన్న మహిళలు, వారి నైపుణ్యాలు దేశాన్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయాలపై పరిశోధన చేస్తున్నానని తెలిపిన ప్రియాంక..నాయకత్వంలో మహిళల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం జ్ఞానోదయాన్ని కలిగిస్తుందని చెప్పారు.
భారత మొదటి రాజ్యాంగ సభలో 15 మంది మహిళలు ఉన్నారని, భారత ప్రాథమిక సూత్రాలను నిర్మించడంలో సహకరించారని మీకు తెలుసా? అంటూ వారి ఫొటోలను షేర్ చేసిన హీరోయిన్.. వారి కృషిని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఇది సరైన రోజు అని భావిస్తున్నట్లు తెలిపింది. అన్నీ మాస్కరేన్, విజయ లక్ష్మి పండిట్, కమల చౌదరి, హన్సా జీవరాజ్ మెహతా, సరోజినీ నాయుడు, సుచేత కృపలానీ, బేగం ఐజాజ్ రసూల్, రేణుక రాయ్, అమ్ము స్వామినాథన్, మాలతీ చౌదరి, రాజ్‌కుమారి అమ్రిత్ కౌర్, లీలా రాయ్, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ద్రాక్షాయణి వేలాయుధన్ లాంటి మహిళామణుల ఫొటోలను షేర్ చేసింది.