- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంకకు అరుదైన గౌరవం
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవాన్ని పొందారు. ‘బ్రిటిష్ ఫ్యాషన్ కౌన్సిల్’ అంబాసిడర్ ఫర్ పాజిటివ్ చేంజ్‌గా నియమించబడ్డారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన పీసీ.. మన మధ్య నెలకొన్న తేడాలను సాధారణీకరించేందుకు.. మరిన్ని ఉత్తేజకరమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని.. ఈ ప్రయాణంలో మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకురావాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫ్యాషన్ అనేది పాప్ కల్చర్ పల్స్‌గా ఉందని.. అది సంస్కృతులను అనుసంధానించేందుకు, ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సమర్ధవంతమైన శక్తిగా పనిచేస్తుందన్నారు. పరిశ్రమ యొక్క అద్భుతమైన వైవిధ్యం, సృజనాత్మకతను సెలబ్రేట్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
I am honored to be the British Fashion Council’s Ambassador for Positive Change while I’m living and working in London over the next year.
We’ll have some really exciting initiatives to share soon, and I look forward to bringing you on this journey with me.@BFC #CarolineRush pic.twitter.com/NAv15vuuoi— PRIYANKA (@priyankachopra) November 16, 2020
సినిమా విషయానికి వస్తే ప్రియాంక పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘ది మ్యాట్రిక్స్ 4’తో పాటు రుస్సో బ్రదర్స్ అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘సిటడెల్’లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న యూనివర్సల్ బ్యూటీ.. నెట్ ఫ్లిక్స్ మూవీస్ ‘ది వైట్ టైగర్’, ‘వి కెన్ బి హీరోస్’ సినిమాలు చేస్తుంది. తాజాగా రొమాన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘టెక్స్ట్ ఫర్ యూ’ సినిమాకు కూడా సైన్ చేసింది ప్రియాంక. ఈ చిత్రంలో ఓట్ లాండర్ స్టార్ సామ్ హ్యూగన్, ఐదు సార్లు గ్రామీ అవార్డు పొందిన సెలిన్ డియోన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.