- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక కెరియర్‌లో మోస్ట్ చాలెంజిగ్ రోల్స్
దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇండస్ట్రీలో 20 ఏళ్ల జర్నీ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్లు చూసిన ప్రియాంక.. తన కెరియర్‌లో మోస్ట్ చాలెంజింగ్ అండ్ ఎగ్జైటింగ్ రోల్స్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. లోతైన, సంఘర్షణ కలిగిన మూడు అద్భుతమైన పాత్రలు చేశానని.. ముగ్గురు అద్భుతమైన దర్శకులతో కలిసి పనిచేశానని తెలిపింది. డైరెక్టర్స్‌ను ఒక యాక్టింగ్ ఇనిస్టిట్యూషన్‌గా అభివర్ణించిన ప్రియాంక.. కాశీబాయిగా సంజయ్ లీలా భన్సాలీ(బాజీరావ్ మస్తానీ) దర్శకత్వంలో, సుసన్నాగా విశాల్ భరద్వాజ్ (7 ఖూన్ మాఫ్), జిల్మిల్‌గా అనురాగ్ బసు(బర్ఫీ) డైరెక్షన్‌లో పనిచేయడం సంతృప్తినిచ్చిందని తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్రల్లో జీవించే అవకాశం ఇచ్చిన దర్శకులకు కృతజ్ఞతలు తెలిపింది.తన నటనతో మెస్మరైజ్ చేస్తూనే ఉన్న ప్రియాంక చోప్రా.. ‘7 ఖూన్ మాఫ్’ సినిమాలో భయంకరమైన అవతార్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్(క్రిటిక్స్) అవార్డును సంపాదించేలా చేసింది. ఇక ‘బాజీరావ్ మస్తానీ’లో తన సహజ నటనకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది. ‘ది వైట్ టైగర్, టెక్స్ట్ ఫర్ యు మరియు మ్యాట్రిక్స్ 4’ లాంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రియాంక నుంచి మరో హిందీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.