రైతులకు మద్దతు తెలుపుతూ బీజేపీ నేత రాజీనామా

by Shamantha N |
రైతులకు మద్దతు తెలుపుతూ బీజేపీ నేత రాజీనామా
X

లక్నో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకురాలు రాజీనామా చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న ప్రియంవద తోమర్.. ఆ పదవితో పాటు పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్‌కు తన రాజీనామా లేఖను పంపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. కొత్త చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. అంతేగాక యూపీలోని బీజేపీ సర్కారు.. రాష్ట్రంలోని మహిళల హక్కులు రక్షించడంలో దారుణంగా విఫలమైందని విమర్శించారు.

Advertisement

Next Story