- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJYM కార్యకర్తలకు ప్రైవేట్ టీచర్ల షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ జనతాపార్టీ యువ మోర్చా నాయకులకు ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు టీచర్లు భారీ షాక్ ఇచ్చారు. జూలె-1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అవుతాయని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, స్కూల్ అడ్మిషన్, బుక్స్ విషయంలో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని న్యూ విజన్ స్కూల్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బీజేవైయం కార్యకర్తలు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే, బీజేవైఎం కార్యకర్తల నిరసనకు వ్యతిరేకంగా స్కూల్‌లోని టీచర్లు, యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. స్కూల్ యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోతే ఏ పార్టీ నుంచి మద్దతు తెలియచేయని పార్టీలు స్కూల్ ఫీజుల విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని టీచర్లు ప్రతిఘటించారు. పరస్పర నినాదాలతో స్కూల్ హోరెత్తిపోయింది.