లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య

by Shyam |
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా విస్తృతవ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ మూలంగా ఉపాధి కోల్పోయిన ఓ ప్రయివేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండలో బుధవారం చోటుచేసుకుంది. దొమకొండకు చెందిన పోతు శేఖర్(32) హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు స్కూళ్లో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ విధించడంతో మార్చిలో స్కూళ్లు మూతపడటంతో స్వగ్రామానికి వచ్చాడు. గత ఏడు నెలలుగా ఉపాధి లేక, అప్పులు చేసి, తీవ్ర మానసిక ఇబ్బందులతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతునికి భార్యా, ఇద్దరు కుతుళ్లు ఉన్నారు.

Advertisement

Next Story