ఆత్మహత్యాయత్నం చేసిన ప్రైవేట్ టీచర్ మృతి

by srinivas |   ( Updated:2020-09-12 06:19:36.0  )
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రైవేట్ టీచర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రవీంద్రభారతి వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతిందారు. రెండ్రోజుల నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగులు శనివారం 3.15గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగట్లేదని కేకలు వేస్తూ రవీంద్రభారతి వద్ద నాగులు నిప్పంటించుకోగా పోలీసులు మంటలు ఆర్పివేసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నాగులును బతికించేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. మంటలు అంటించుకున్న సమయంలో జై తెలంగాణ, జై కేసీఆర్ సారు అంటూ నాగులు నినాదాలు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed