రియల్‌లో 85 శాతం తగ్గిన పెట్టుబడులు

by Harish |   ( Updated:2020-09-23 07:31:16.0  )
రియల్‌లో 85 శాతం తగ్గిన పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (Kovid-19) మహమ్మారి భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని (real estate sector)తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత పెట్టుబడిదారులు ఈ రంగంలో ఇన్వెస్ట్ చేసే అంశంపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఏడాది జనవరి-ఆగస్టు మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఈక్విటీ పెట్టుబడులు 85 శాతం పడిపోయి సుమారు రూ. 6500 కోట్లుగా నమోదైనట్టు కొలియర్స్ ఇంటర్నేషనల్, ఫిక్కీ సంయుక్త నివేదిక వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు (Private equity investments) సుమారు రూ. 42 వేల కోట్లుగా నమోదయ్యాయి.

ఇందులో డాటా సెంటర్ల విభాగంలో గరిష్ఠంగా 46 శాతం పెట్టుబడులు ఉండగా, ఆఫీసుల విభాగం ఆగస్టు నాటికి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 20 శాతంగా(సుమారు రూ. 1500 కోట్లు)గా ఉంది. పారిశ్రామిక, గడ్డంగుల వాటా 12 శాతం, ఆతిథ్యం 9 శాతం, గృహ నిర్మాణాలు 8 శాతంగా నమోదు చేశాయి. దేశీయంగానే కాకుండా, విదేశీ పెట్టుబడిదారుల్లో కరోనా భయాలు ఇంకా కొనసాగుతున్న క్రమంలో భారత రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంశంపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ‘ఫ్యూచర్ ఇండియా; వ్యూహాత్మక ప్రైవేట్ ఈక్విటీల ఆకర్షణ’ పేరుతో వెలువరించిన నివేదిక తెలిపింది. గతేడాది వచ్చిన పెట్టుబడుల మొత్తంలో ఈసారి 15 శాతం మాత్రమే వచ్చాయని కొలియర్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. బలమైన దేశీయ వినియోగం పారిశ్రామిక, లాజిస్టిక్ ఆస్తులపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కలిగి ఉందని నివేదిక తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed