- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెప్టెన్‌గా నా లక్ష్యం అదే : శిఖర్ ధావన్
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా నియమించబడటం నాకు లభించిన గొప్ప గౌరవం అని శిఖర్ ధావన్ అన్నాడు. జట్టు సారథిగా అందరినీ సంతోషంగా ఉంచుతూ.. విజయం వైపు జట్టును నడిపించాలని భావిస్తున్నానని.. ప్రస్తుతానికి అదే నా లక్ష్యమని శిఖర్ ధావన్ చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘ఫాలో ది బ్లూస్’ అనే కార్యక్రమంలో ధావన్ పాల్గొని అనేక విషయాలు చెప్పుకొచ్చాడు. ‘జట్టులో మంచి సరదాగా ఉండే కుర్రాళ్లతో పాటు అనుభవం ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నాకు రంజీ ఆడుతున్న సమయం నుంచి తెలుసు. తాను భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. అందుకే మా మధ్య మంచి అవగాహన ఉన్నది. ఇప్పటికీ నాకు అతడితో సత్సంబంధాలు ఉన్నాయి’ అని ధావన్ చెప్పుకొచ్చాడు. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నుంచి భారత జట్టు వన్డే సిరీస్ ఆడనున్నది. యువకులు, అనుభవజ్ఞలతో జట్టు సమతూకంగా ఉన్నది.
పృథ్విషానే ఓపెనర్?
భారత పరిమిత ఓవర్ల రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు తోడు శ్రీలంకలో ఎవరు బరిలోకి దిగుతారని అందరికీ అనుమానం ఉన్నది. ఐపీఎల్‌లో రాణించిన దేవ్‌దత్ పడిక్కల్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లలో ఒకరు ధావన్‌తో పాటు ఓపెనింగ్ చేస్తారని నిపుణులు భావించారు. అయితే అంతర్జాతీయ అనుభవం ఉన్న పృథ్వీ షా బరిలోకి దిగుతాడని టీమ్ ఇండియా యాజమాన్యం చెబుతున్నది. ఐపీఎల్ 2021లో పృథ్వీషా బ్యాట్‌తో అదరగొట్టాడు. అందకు ముందు దేశవాళీలో కూడా పరుగుల వరద పారించాడు. అందుకే ఓపెనర్‌గా పృథ్వీషానే సరైన ఎంపిక అని టీమ్ ఇండియా భావిస్తున్నది.