- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖైదీలతో నిండిపోయిన జైళ్లు
దిశ, క్రైమ్ బ్యూరో: దేశవ్యాప్తంగా జైళ్లన్నీ ఖైదీలతో నిండిపోయాయి. ఉండాల్సిన సామర్థ్యం కంటే ఖైదీలు అధికంగా ఉండడంతో కిక్కిరిసిపోతున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం జైళ్లల్లో 4,03739 మంది ఖైదీల సామర్థ్యానికి సరిపడా జైళ్లు ఉండగా.. 2019 డిసెంబరు 31 నాటికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రచురించిన ప్రిజన్స్ స్టాటిస్టిక్స్ ఇండియా ప్రకారం 4,78,600 మంది ఖైదీలు ఉన్నట్టు సమాచారం.
యూపీలోనే అత్యధికంగా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్, లక్ష్యదీప్ దీవుల్లో సామర్థ్యానికి లోబడే ఖైదీలు ఉన్నారు. కాగా, కేరళలో 6,841 మందికి, 7,499 ఖైదీలు, కర్నాటకలో 14,315కి గాను 14,515 మంది అధికంగా ఉన్నారు. ఈ ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటకలో 200, కేరళలో రాష్ట్రంలో 658 ఖైదీలు అదనంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఉత్తరాది రాష్ట్రాలు అయిన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, చంఢీఘర్ తో పాటు ఢిల్లీ ప్రాంతాల్లో ఖైదీల అత్యధికంగా ఉన్నారు. దేశంలో 74 వేల ఖైదీలు అధికంగా ఉండగా.. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 40,957 మంది ఖైదీలు అధికంగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఢిల్లీలో 7,508 మంది, ఉత్తరాఖండ్ లో 2089, హర్యానాలో 1117 మంది, పంజాబ్ లో 688, హమాచల్ ప్రదేశ్ లో 227, జమ్మూ కాశ్మీర్ లో 779 మంది ఖైదీలు అధికంగా ఉన్నారు.
అండర్ ట్రయిల్ ఖైదీలు 3.30 లక్షలు..
ప్రస్తుతం ఉన్న ఖైదీలలో శిక్షలు అనుభవించే వారికంటే శిక్షలు ఖరారు కాకుండా.. అండర్ ట్రయిల్ ఖైదీలే అధికంగా ఉన్నారు. మొత్తం 4,78,600 ఖైదీలలో 3,30,487 మంది అండర్ ట్రయిల్ ఖైదీలుగానే ఉన్నారు. ఈ ప్రకారం 4.78 లక్షల ఖైదీలలో 1.48 లక్షల మంది మాత్రమే కేసులు ట్రయిల్ పూర్తయ్యి శిక్షలు అనుభవిస్తున్నవారు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం లక్ష మందికి పైగా ఖైదీలు ఉండా, అందులో 73 వేల మంది అండర్ ట్రయిల్ ఖైదీలు ఉన్నారు. బిహార్ లో 31 వేలు, మహరాష్ట్రలో 27 వేలు, మధ్యప్రదేశ్లో 24 వేలు, పశ్చిమ బెంగాల్ లో 16 వేలు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఖైదీలు 6717 మంది కాగా, 4384 మంది అండర్ ట్రయిల్ ఖైదీలుగా ఉన్నారు.