ప్రిన్స్ హ్యారీ తనను మోసం చేశాడన్న యువతి.. పగటి కలలు మానమన్న జడ్జి

by Shamantha N |   ( Updated:2021-04-13 01:26:18.0  )
ప్రిన్స్ హ్యారీ తనను మోసం చేశాడన్న యువతి.. పగటి కలలు మానమన్న జడ్జి
X

చండీగఢ్ : బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఓ యువతి పంజాబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని, హ్యారీపై తక్షణమే అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషన్ లో కోరింది. దీనిపై విచారణ చేపట్టిన పంజాబ్ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టిపారేసింది. ఈ పిటిషన్ లో ఏమీ లేదని.. పగటి కలలు కనడం మానేయాలని సూచించింది. ఎప్పుడైనా యూకేకు వెళ్లి ప్రిన్స్‌ను కలిశారా..? అని యువతిని కోర్టు ప్రశ్నించగా.. సోషల్ మీడియాలోనే చాట్ చేసుకున్నామని, యూకేకు ఎప్పుడూ వెళ్లలేదని తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘సోషల్ మీడియా సైట్లలో ప్రిన్స్ హ్యారీ పేరు మీద నకిలీ ఖాతాలు సృష్టించి ఉన్నాయి. పంజాబ్ లోని ఓ మారుమూల గ్రామంలో ఆయన సైబర్ కేఫ్ లో చాయ్ తాగినట్టు కూడా చేయగలరు..’ అంటూ కోర్టు తెలిపింది. ఇలాంటి సోషల్ మీడియా స్కాంలను ఈ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోదు అని సదరు పిటిషన్ ను కొట్టేసింది.

Advertisement

Next Story

Most Viewed