డ్రైవర్ లెస్ ట్రైయిన్‌ను ప్రారంభించిన ప్రధాని

by Shamantha N |
డ్రైవర్ లెస్ ట్రైయిన్‌ను ప్రారంభించిన ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మొట్టమొదటిసారిగా లోకో పైలట్ రహిత మెట్రో ట్రైయిన్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ కూడా హాజరయ్యారు. ఈ డ్రైవర్ లెస్ ట్రైయిన్‌ను.. మాజెంటా లైన్‌లో జనక్‌పురి నుంచి బొటానికల్ గార్డెన్‌ వరకు 37 కిలోమీటర్ల మేర నడపనున్నారు. 2022లో మజ్లిస్‌ పార్క్‌ నుంచి శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్లు వరకు పొడిగించనున్నారు. దీంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో పనిచేసే నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డు(NCMC)ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఎయిర్​పోర్ట్​ ఎక్స్​ప్రెస్​ లైన్​లో భాగంగా న్యూ దిల్లీ నుంచి ద్వారకా సెక్టార్ ​21 వరకు ఉన్న 23 కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed