- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీ ఫోన్
దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఆదివారం టెలిఫోన్ ద్వారా సంభాషించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కేసులు పెరుగుతున్న తీరు, అన్‌లాక్ అమలవుతున్న విధానం, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, టెస్టులు ఎంత సంఖ్యలో జరుగుతున్నాయి, కరోనా మరణాల రేటు.. ఇలా అనేక అంశాలను చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా కరోనా అంశాలపైనే ఎక్కువగా చర్చించినట్లు అధికారుల సమాచారం. తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్రంలో ప్రతీరోజు సుమారు 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో గణనీయంగానే ఉంటున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లోనూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ రాష్ట్రాలతో ప్రధాని ఇంకా మాట్లాడలేదు. అసోం, బీహార్ రాష్ట్రాల్లో ప్రధానంగా వరద అంశంపైనే ఎక్కువగా ప్రధాని చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల విషయంలో మాత్రం ప్రధాన చర్చ కరోనా కేసుల కట్టడి, నిర్ధారణ కోసం చేస్తున్న టెస్టుల సంఖ్య, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల సంఖ్య, ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్న మందులు, వైద్య పరికరాలు తదితరాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. తెలంగాణ సీఎంతో చర్చించిన విషయాల్లో హైదరాబాద్‌లో ఎక్కువగా వైరస్ కేసులు నమోదవుతున్నందున దాన్ని తగ్గించడానికి, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకుంటున్న చర్యలు, జిల్లాలకు కూడా వైరస్ వ్యాప్తిని జరుగుతూ ఉన్నందున ముందుజాగ్రత్త చర్యల కోసం అవలంబిస్తున్న విధానం, జిల్లాల్లోనూ చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలు తదితరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా వెంటనే తెలియజేయాలని, అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు భరోసా ఇచ్చినట్లు తెలిసింది.