- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మినీ మేడారం జాతర తేదీల ప్రకటన
దిశ ప్రతినిధి, వరంగల్: గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం చిన్న జాతర నిర్వహణ తేదీలను ఆలయ కమిటీ ఖరారు చేసింది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు ఈ జాతర జరగనున్నట్టు స్పష్టం చేసింది. ఈ సంవత్సరం చిన్న మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు ఆలయ కమిటీ, పూజారులు సిద్ధమయ్యారు. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో రేపటి నుంచి జాతర పనులు ప్రారంభం కానున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది.
పూజా కార్యక్రమాలు…
24వ తేదీ బుధవారం: గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఉదయం గ్రామ నిర్భంధన
25వ తేదీ గురువారం సమ్మక్క, సారలమ్మలకు పసుపు, కుంకుమలతో అర్చన
26వ తేదీ శుక్రవారం భక్తులకు అమ్మవారి దర్శనం
27వ తేదీ శనివారం పూజ కార్యక్రమాలు ముగింపు
ఈ మేరకు సమ్మక్క-సారలమ్మ ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ వెల్లడించారు.