జనవరి నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌ల ధరలకు రెక్కలు!

by Anukaran |   ( Updated:2020-12-27 05:19:07.0  )
జనవరి నుంచి టీవీలు, ఫ్రిడ్జ్‌ల ధరలకు రెక్కలు!
X

దిశ, వెబ్‌డెస్క్: గృహోపరకారణాల ధరలు వచ్చే ఏడాదిలో పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి కీలకమైన ఇన్‌పుట్ పదార్థాల ఖర్చులు పెరగడంతో పాటు సముద్ర, వాయు మార్గాల్లో సరుకు రవాణా ఛార్జీలు పెరుగుదల కారణంగా దేశీయంగా ఎల్ఈడీ, రెఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ లాంటి గృహోపకరణాల ధరలు జనవరి నుంచి దాదాపు 10 శాతం వరకు పెరుగుతాయని తెలుస్తోంది.

ఇటీవల అంతర్జాతీయ పరిణామాలతో టీవీ ప్యానెల్స్ ధరలు రెండు రెట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ముడిచమురు ధరల పెరుగుదలతో ప్లాస్టిక్ ధరల కూడా పెరిగిందని తయారీదారులు వెల్లడించారు. ఎల్‌జీ, పానసోనిక్, థాంసన్ వంటి తయారీదారులు జనవరి నుంచి ధరలను పెంచనున్నట్టు స్పష్టం చేయగా, సోనీ పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు, మరికొద్ది రోజుల్లో ధరల పెంపును ప్రకటించనున్నట్టు పేర్కొంది.

వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సమీపకాలంలో తమ ఉత్పత్తి ధరలపై ప్రభావితం ఉంటుంది. జనవరిలో 6-7 శాతం పెంచాలని భావిస్తున్నాం. తొలి త్రైమాసికంలో 10-11 శాతం పెరిగే అవకాశాలున్నాయని’ పానసోనిక్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ మనీష్ శర్మ చెప్పారు. ఎల్‌జీ సైతం 7-8 శాతం ధరలను పెంచాలని నిర్ణయించింది. ‘సరఫరాలో జరుగుతున్న మార్పులను గమనిస్తున్నాం. పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత ధరల విషయంలో ఖచ్చితమైన నిర్ణయానికి వస్తామని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ వెల్లడించారు.

Advertisement

Next Story