ప్రధానితో భేటీ కానున్న రష్యా అధ్యక్షుడు.. కీలక ఒప్పందాలుపై చర్చ

by Shamantha N |
modi
X

న్యూఢిల్లీ: భారత్, రష్యాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సమావేశం కానున్నారు. 2019 బ్రిక్స్ సమావేశాల తర్వాత ఇరు దేశాల నేతలు తొలిసారిగా ప్రత్యక్షంగా కలుస్తున్నారు.

దేశ రాజధానిలో హైదరాబాద్ హౌజ్ దీనికి వేదిక కానుంది. 2000 నుంచి ఇరు దేశాల మధ్య వార్షిక సదస్సు సంప్రదాయంగా వస్తోంది. దీంతో పాటు రక్షణ, విదేశాంగ మంత్రుల ‘2+2’ చర్చను కూడా ప్రారంభించనున్నారు. దేశాధినేతల సదస్సుకు ముందు రక్షణ మంత్రులు, వీరితో పాటు విదేశాంగ మంత్రులు కూడా సమావేశం కానున్నారు. మీడియా ప్రశ్నోత్తరాల సెషన్ కూడా ఇరు సమావేశాల్లో ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేశాక పొంచి ఉన్న తీవ్రవాదం, అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంతో సహా ఇతర సమస్యల పరిష్కారానికి సహకారం అంశంపై చర్చించనున్నారు. ముఖ్యంగా సరిహద్దు వివాదాల్లో రష్యా సహకారంతో పాటు, పలు అభివృద్ధి అంశాలు, వాణిజ్య ఒప్పందాలు, రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక ఒప్పందాలు గురించి చర్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story