మరింత భారం కానున్న లగ్జరీ కార్లు!

by Anukaran |   ( Updated:2021-02-02 07:11:20.0  )
మరింత భారం కానున్న లగ్జరీ కార్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మేక్ ఇన్ ఇండియా’ను మరింత ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటో పరికరాలపై దిగుమతి సుంకాన్ని 5-7.5 శాతం మధ్య పెంచారు. ఈ పెంపులో సేఫ్టీ గ్లాస్, ఇంజిన్, గేర్ పరికరాలు, ఎలక్ట్రికల్, వైరింగ్ విడిభాగాలు, బ్రేకులు, పెడల్ లాంటివి ఈ జాబితాలోకి వస్తాయి. ఈ పెంపు వల్ల దేశీయంగా లగ్జరీ కార్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాహనం, దిగుమతి చేసుకున్న విడిభగాలను బట్టి ప్రీమియం, లగ్జరీ కార్ల ధరలు 1 శాతం నుంచి 2.5 శాతం వరకు రూ. 35 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

ఆటో పరిశ్రమలో దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలపై కేంద్ర సుంకాన్ని పెంచడం ఇది నాలుగో ఏడాది అని, దీనివల్ల ప్రీమియం, లగ్జరీ కార్ల తయారీ కంపెనీలను దెబ్బతీస్తాయని కంపెనీల వారు పేర్కొంటున్నారు. ఆటో పరికరాల సుంకం పెరుగుదల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించని షాక్. దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. తద్వారా కార్ల ధరల పెంపు ద్వారా వినియోగదారులపై భారం తప్పని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ స్వెంక్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story