- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు ఆ నాయకుల వార్నింగ్.. అరెస్ట్‌లతో అడ్డుకోలేరు
దిశ, ఇల్లందు: చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పోనివ్వకుండా రాత్రికి రాత్రే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకుల, కార్యకర్తల ముందస్తు అక్రమ అరెస్టు చేశారు. ఇల్లందు మండల ఎస్ఐ కుమారస్వామి పోలీసుల బృందం ప్రగతి భవన్‌కి పోనివ్వకుండా డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు కాలంగి హరిక్రిష్ణను దారి మధ్యలో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పోలీసులతో రాత్రికి రాత్రే ముందస్తు అరెస్టులు చేసినా ప్రగతి భవన్ ముట్టడిని అడ్డుకోలేరని డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు కాలంగి హరిక్రిష్ణ హెచ్చరించారు. ఈ క్రమంలో అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని శాంతియుతంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అడగడానికి హైదరాబాద్ ప్రగతి భవన్‌కి వెళ్తుంటే ముందస్తుగా పోలీసులతో రాత్రికి రాత్రే అక్రమంగా జిల్లా వ్యాప్తంగా అరెస్టులు చేయడమేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భయపడే ప్రభుత్వం ఈ పిరికిపంద చర్యలకు పూనుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌ని, పెండింగ్ ఉపకార వేతనాలు, బోధన రుసుములు విడుదల చేయాలని అన్నారు. విద్యాసంస్థలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ తక్షణం విడుదల చేయాలని అన్నారు.
నిరుద్యోగ భృతి అర్హులైన యువతకు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు ఒక లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయక ఉద్యోగాలు రాక నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి యువతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాల నోటిఫికేషన్, పెండింగ్ ఉపకార వేతనాలు, విద్యాసంస్థలు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. చలో ప్రగతి భవన్ ముట్టడిని అక్రమ అరెస్టులతో ఆపలేరని వారు హెచ్చరించారు.