- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఇలాకాలో రచ్చబండ ఎఫెక్ట్.. వారి అరెస్ట్‌లు షురూ..
దిశ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం ఎర్రవల్లి లో సోమవారం కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ కార్యక్రమాన్ని హస్తం నేతలు ప్రజలతో భారీగా ప్లాన్ చేశారు. ప్రోగ్రాం కి పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి తో సహా కాంగ్రెస్ నేతలు తరలి వస్తారని పిలుపునిస్తూ, ప్రచారం కూడా చేశారు. అయితే రచ్చబండ కార్యక్రమానికి అనుమతుల్లేవని కొవిడ్ నిబంధనల దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కుదరదంటూ గజ్వేల్ నియోజకవర్గంలో అర్ధరాత్రి కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి ముందస్తుగా అరెస్టు చేశారు. నేతలను అరెస్టు చేసి నియోజకవర్గంలో ఆయా మండలాల పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టైన నేతల్లో జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు గుంటుకు శ్రీనివాస్, జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు నల్ల శ్రీధర్, చిటుకుల శివారెడ్డి, జమాల్ పూర్ విఠల్, గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు నక్క రాములు గౌడ్, మండల మైనార్టీ అధ్యక్షుడు అజ్గర్,కోశాధికారి నాయిని తిరుపతిలు ఉన్నారు.
బస్సుల్లో తనిఖీలు
సిద్దిపేట జిల్లా సరిహద్దు వంటిమామిడి వద్ద చెక్ పోస్ట్ పెట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు జిల్లా లో ప్రవేశించకుండా జిల్లా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చే వాహనాలను సైతం వదలకుండా బస్సుల్లోనూ వారు తనిఖీలు చేపడుతున్నారు.
అక్రమ అరెస్ట్ లు సరికాదు
అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమాన్ని అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గుంటుకు శ్రీనివాస్ అరెస్ట్ లతో ప్రజా వ్యతిరేకతను నిలపజాలరని ఆయన పేర్కొన్నారు. కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వం కలిసి ధాన్యం కొనుగోలు విషయంలో రైతన్నలను మోసం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు.